హనుమకొండ, జనతా న్యూస్: ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.గురువారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలలో 9 కోట్ల ఏడు లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామాలలో ఎండాకాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. తాగునీటికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు హుస్నాబాద్ నియోజకవర్గానికి 3.5 కోట్ల రూపాయలను కేటాయించారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన బాధ్యత అని అన్నారు. తనను ఆశీర్వదించిన నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు. రేషన్ కార్డుల జారీ త్వరలో జరగనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు యువతను క్రీడల్లో ప్రోత్సహించే విధంగా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు.
For E Paper..
Click Here..
Daily News E-Paper: Latest News and Insights from Telangana (janathadaily.in)
ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఎల్కతుర్తి మండలంలో వివిధ అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. హనుమకొండ జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి మేకల స్వప్న, వైస్ ఎంపిపి తంగేళ్ళ నగేష్, హనుమకొండ, హుస్నాబాద్ ఆర్డీవోలు వెంకటేష్, రామ్మూర్తి, జడ్పి సీఈవో విద్యాలత, ఎంపీడీవో విజయ్ కుమార్, ఆర్అండ్ బి, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.