Saturday, July 5, 2025

విద్యార్థులు ఒత్తిడికి లోనవ్వకుండా పరీక్షలు రాయాలి

ఇల్లంతకుంట, జనతా న్యూస్: నెల 18 నుంచి జరిగే పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఎస్సై రాజు గౌడ్ అన్నారు. ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్ పేట మోడల్ స్కూల్ లో బుధవారం రోజున ఎఫ్ బి ఐ వారు పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు మెటీరియల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సై మాట్లాడుతూ ఉన్నత చదువులు చదవడానికి పదవ తరగతి తొలి మెట్టు అని, నిర్లక్ష్యం చేయకుండా మంచి ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ఎవరు బండ్ల మీద రావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు శరత్ కుమార్ రెడ్డి, ఎఫ్ బి ఐ అధ్యక్షులు తూముకుంట రాజేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ మధుకర్, మామిడి సంజీవ్, విద్యా కమిటీ చైర్మన్ సంతోష్ రెడ్డి, ఎఫ్ బి ఐ సభ్యులు వేణుమాధవ్ శ్రీనివాస్ రెడ్డి, బాబు మధు కిరణ్ మనోహర్ రెడ్డి వెంకటేశ్వరరావు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page