విజయవాడ, జనతా న్యూస్: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఐదేళ్ల కిందట హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయిన జనిపల్లి శ్రీనివాసరావు ( కోడి కత్తి శ్రీను) సంచలనంగా మారాడు. ఐదేళ్ల పాటు జైలు జీవితం గడిపిన ఆయన ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చాడు. ఈ సందర్భంగా ఆయనకు దళిత సంఘాలు ఘనంగా స్వాగతం పలికారు. అప్పటి నుంచి కోడికత్తి శ్రీను గురించి రకరకాలుగా చర్చలు సాగుతున్నాయి. తాజాగా ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా ఆయన సోమవారం రాత్రి ‘జై భీమ్’ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ కోడి కత్తి శ్రీనుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన అమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.
‘జై భీమ్’ పార్టీ నుంచి కోడి కత్తి శ్రీను పోటీ?
- Advertisment -