జనతన్యూస్ బెజ్జంకి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహ జ్యోతి పథకాన్ని మాజీ ఎంపీపీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, విద్యుత్ అధికారులతో కలిసి సోమవారం ప్రారంభించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు రూ. 5 లక్షల నిధులతో కూడిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ కనగండ్ల కవిత, జిల్లా కిసాన్ సేల్ ప్రధాన కార్యదర్శి చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహంకాళి ప్రవీణ్, గ్రామ శాఖ అధ్యక్షుడు రెడ్డి రామకృష్ణారెడ్డి, ముక్కిస అనిల్ రెడ్డి, చిలివేరి రాజిరెడ్డి, యాకూబ్ రెడ్డి, కొమ్ముల రవి, రత్నాకర్ రెడ్డి, కరివేద వెంకటరెడ్డి, రాజిరెడ్డి, గ్రామ యూత్ అధ్యక్షులు హరీష్, మండల వివిధ అనుబంధ సంఘాల నాయకులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీపూర్ లో ‘గృహ జ్యోతి’ ప్రారంభం
- Advertisment -