Friday, March 13, 2026

వైభవంగా గిరిజా మృత్యుంజయ కల్యాణం

తిమ్మాపూర్, జనతా న్యూస్:తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో శ్రీ గిరిజా మృత్యుంజయ మహా దేవాలయంలో శ్రీ గిరిజా మృత్యుంజయ మహా దేవుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. గిరిజా గోశాల ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్ బ్రహ్మ శ్రీ వేధ మూర్తులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పురుషోత్తం మిశ్రాసోమ వారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.కల్యాణ వేడుకకుఎల్ఎండీ వెంకటేశ్వర ఆలయం తరుపున కమిటీ సభ్యులు పట్టు వస్త్రాలను సమర్పించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చల్ల మోహన్ రెడ్డి మాట్లాడుతూ..  శివాలయం నిర్మించి నేటితో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి స్థానిక భక్తులు, ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కళ్యాణంలో ఈఎన్సి శంకర్, ఎస్ఇ శివకుమార్, కోశాధికారి గజవెల్లి భాలకిషన్ రావు, సహాయ కోశాధికారి బట్టు కరుణాకర్, ఎంపీపీ కేతిరెడ్డి వనిత దేవేందర్ రెడ్డి, శ్రీకాంత్ శర్మ, వొంటెల రవీందర్ రెడ్డి, పోలు కిషన్, వెంకటేశ్వర్ రావు, ప్రసాద్ రెడ్డి, గంగారపు రమేష్, చారి, బట్టు కరుణాకర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page