తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్ సూర్యకిరణ్ అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజుల కింద పచ్చకామెర్లు రావడంతో ఆసుపత్రిలో చేరారు. సోమవారం చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరుణంపై టాలీవుడ్, కోలీవుడ్ లో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సూర్యకిరణ్ తెలుగులో సుమంత్ హీరోగా వచ్చిన ‘సత్యం’ సినిమాను డైరెక్షన్ చేశారు. ఆ తరువాత సుమంత్ తోనే ‘ధన 51’ మూవీ తీశారు. ఆ తరువాత రాజుభాయ్, చాప్టర్ 6 చిత్రాలకు డైరెక్షన్ చేశారు. ఇదిలా ఉండగా తెలుగులో స్టార్ హీరోయిన్ కళ్యాణి భర్త సూర్యకిరణ నే. అయితే వీరు మనస్పర్థలు కారణంగా విడిపోయారు. సూర్యకిరణ్ అంత్యక్రియలు బుధవారం చెన్నైలో నిర్వహించనున్నారు.
టాలీవుడ్ లో విషాదం.. ‘సత్యం’ డైరెక్టర్ సూర్యకిరణ్ మృతి
- Advertisment -