హుజూరాబాద్, జనతా న్యూస్:హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కకున్నారు. పోలీసులపై ఆయన చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ కేసు నమోదైంది. బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు కరీంనగర్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కరీంనగర్ లో మార్చి 8న నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని సోషల్ మీడియా వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. దీంతో కరీంనగర్ కు చెందిన పురుషోత్తం, ఆషీష్ గౌడ్ అనే వ్యక్తులు కరీంనగర్ లోని వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదైంది.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు
- Advertisment -