Los Angels: సినిమా ఇండస్ట్రీలో అందించే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ కోసం ప్రతి సినిమా నటుడు ఎదురు చూస్తుంటారు. 2023 ఆస్కార్ అవార్డుల్లో తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’ కి నాటు నాటు అనే పాటకు చోటు దక్కడంతో పాటు అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి అవార్డులు ఎవరికి వస్తాయనే ఉత్కంఠ నెలకొంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా 2024 సంవత్సరానికి సంబంధించి 96వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ అవార్డుల కార్యక్రమంలో..
ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ ( ఓపెన్ హైమర్)
ఉత్తమ సహాయ నటి : దేవైన్ జో రాండల్స్ ( ది ఓల్డ్ వర్క్స్)
ఉత్తమ మేకప్ ఆర్టిస్టు : నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ ( పూర్ థింగ్స్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : కార్డు జెఫర్ పన్ ( అమెరికన్ పిక్షన్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జస్టిస్ ట్రైట్, అర్థర్ హరారీ(అనాటమీ ఆఫ్ ఎ పాల్)
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ది బాయ్ అండ్ ది హిరాన్
బెస్ట్ కాస్టూమ్ డిజైన్ (హోలి వెడ్డింగ్ టన్ (పూర్ థింగ్స్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : జేమ్స్ ప్రైస్ సోనా హెత్ (పూర్ థింగ్స్)
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిలిం : (ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్)
ఉత్తమ సినిమాటోటోగ్రాఫర్ :హెయటే వన్ హోయటేమా ( ఓపెన్ హైమర్)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ : గాడ్జిల్లా మైనస్ వన్ (తకాషి యమజాకీ, క్యోకో షిబుయా, మకాషి తకషాకీ, తత్పుజీ నోజిమా)
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ : ఓపెన్ హైమర్ (జెన్నీఫర్ లేమ్)
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ద లాస్ట్ రిపేర్ షాప్ (బెన్ ప్రౌడ్ ఫుట్, క్రిస్ బోవర్స్)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: 20 డేస్ ఇన్ మరియా పోల్
ఉత్తమ సినిమా టోగ్రఫీ : ఓపెన్ హైమర్ (హోయటే, హోయటేమ)
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ద వండర్ ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్