-అబద్దాల్లో కాంగ్రెస్ ముందుంది
-ఐక్యంగా ఉంటేనే పవర్
-12న కరీంనగర్ కధనభేరికి తరలిరండి
-మాజీ ఎమ్మెల్యే రసమయి
-బీఆర్ఎస్ లోనే అసంతృప్తి సెగలు
తిమ్మాపూర్, జనతా న్యూస్: తిమ్మాపూర్ మండలంలో 300 ఇళ్లు ముగ్గుపోసి బిల్లులు ఇస్తే తానే స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేకి శాలువా కప్పుతానని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఈ నెల 12తేదీన కరీంనగర్ లో నిర్వహించే కరీంనగర్ కధనభేరి సభ విజయవంతం కోసం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నుస్తులాపూర్ లో నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గెలిచేది లేదని కాంగ్రెస్ హామీలు ఇచ్చిందని, ఇవన్నీ అమలుకాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అబద్దాల్లో ముందుందని అన్నారు. కాంగ్రెస్ అబద్దాల హామీలను నమ్మి ప్రజలు తీర్పునిచ్చారని, ఇప్పుడు హామీలు నెరవేరడం లేదని, వీటిని గ్రామాల్లో చర్చించాలని సూచించారు. మానకొండూర్ లో ఇరవై ఏళ్ల నుంచి తిరుగుతున్న వ్యక్తి ఒక్క అవకాశం ఇవ్వాలని అడిగితే ప్రజలు మార్పు కోసం తీర్పునిచ్చారని అన్నారు. అన్నీ గ్రామాల్లో బీఆర్ఎస్ కి మైనస్ ఉందని, దళిత బంధు ఇచ్చిన గ్రామంలో సైతం ఓట్లు రాలేదని గుర్తు చేశారు. ఇలాంటివి తెలంగాణాలో జరిగిన పరిణామాలు అన్నారు.
పవర్ లేనపుడు కార్యకర్తలు ఐక్యంగా ఉంటేనే పవర్ వస్తుందన్నారు. ఎంపీగా వినోద్ కుమార్ ఉన్నపుడు, బండి సంజయ్ ఉన్నపుడు అబివృద్ది విషయాన్ని ప్రజలకు తెలుపాలని కోరారు. భారీ సంఖ్యలో జనాన్ని తరలించాలని బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలకు సూచించారు. కష్టపడిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటదన్నారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రమేష్, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, దుండ్ర రాజయ్య, సాయిల్ల కొమురయ్య, నాయిని వెంకటరెడ్డి, పాశం అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.