హైదరాబాద్, జనతా న్యూస్: టీఎస్ ఆర్టీసీలో పీఆర్సీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీలో పనిచేసిన వారికి ఉత్తమ ఉద్యోగుల అవార్డులను గురువారం ఆర్టీసీ కళాభావన్ లో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలోనే ఆర్టీసీ లో ఉద్యోగ నియామకాలు చేపడుతామని అన్నారు. 2017, 2021 పీఆర్సీ పెండింగ్ బిల్స్ పై చర్చిస్తున్నామని, దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున లాభాలు తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు మహాలక్ష్మి పేరుమీద అవార్డులు ఇవ్వాలని నిర్ణయించామని, ఇప్పటికే ఆర్టీసీ కార్మికులకు రూ.280 కోట్ల బాండ్లు ప్రకటించామన్నారు. మహా లక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల బాట పట్టిందన్నారు.
ఆర్టీసీలో పీఆర్సీపై త్వరలో నిర్ణయం :మంత్రి పొన్నం
- Advertisment -