భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం కాశ్మీర్ పర్యటన కోసం ల్యాండ్ అయ్యారు. జమ్మూ కాశ్మీర్ కు 370 ఆర్టికల్ రద్దు తరువాత ఆయన మొదటిసారి ఇక్కడ పర్యటించడం విశేషం. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లోని బక్షి స్టేడియంలో నిర్వహించే‘వికసిత్ భారత్.. వికసిత్ జమ్మూ కాశ్మీర్’ అనే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఈ స్టేడియానికి అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. భారీగా పోలీసులు మోహరించి భద్రత కట్టుదిట్టం చేశారు. 2019లో జమ్మూ కాశ్మీర్ లో ఉన్న 370 ఆర్టికల్ ను రద్దు చేసి ప్రత్యేక హోదా కల్పించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మోదీ జమ్మూ కు మూడుసార్లు వచ్చారు. కానీ కాశ్మీర్ కు రావడం ఇదే తొలిసారి. మరికొన్ని నెలల్లో ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనపై ఆసక్తి నెలకొంది.