బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్ లో జరిగిన బాంబు పేలుడులో ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితుడి గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.10 లక్షల బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి నిందితుడి ఫొటోను విడుదల చేసింది. మార్చి 1న బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్ లో పేలుడు ఘటన కలకల రేపిన విషయం తెలిసిందే ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ బాంబు బేలుడులో నిందితుడు ఆర్ డీ ఎక్స్ ఉపయోగించాడని, నిపుణులు గుర్తించారు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
అతడిని పట్టిస్తే రూ.10 లక్షల బహుమానం..
- Advertisment -