Saturday, July 5, 2025

మెగా హీరో పక్కన జాన్వీ.. కన్ఫామ్..

అందాల తార శ్రీదేవి కూతురు జాన్వి కపూర్.. ఇంకా తెలుగు తెరపై కనిపించకముందు ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ అమ్మడు ఎన్టీఆర్ తో కలిసి ‘దేవర’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఇప్పుడు ఏకంగా మెగా హీరో రామ్ చరణ్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం చెర్రీ శంకర్ డైరెక్షన్ లో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ‘ఉప్పెన’ డైరెక్టర్  బచ్చిబాబు  తో  ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరా? అని ఇంతకాలం తీవ్ర చర్చ జరిగింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ పక్కన జాన్వికపూర్ అని కొన్ని రోజులగా చర్చ సాగుతోంది. ఈ తరుణంలో ఈ మూవీ టీం జాన్వికే అవకాశం ఇచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో అందాల తార అప్పుడే రెండో సినిమాలో ఛాన్స్ కొట్టేయడంతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page