మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలపై అరెస్టయి జీవిత ఖైదు పడిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు ఊరట లభించింది. ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు మంగళవారం తీర్పు విలువరించింది. సెషన్స్ కోర్టు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది. నక్సల్స్ తో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలతో గచ్చిబౌలి స్టేషన్స్ కోర్టులో ఆయనకు 2017లో దోషిగా నిర్దారిస్తూ జీవిత ఖైదు పడింది. ఆ తరువాత ఆయన బాంబే హైకోర్టుకు సవాలు చేయగా కిందికోర్టు తీర్పును 2022 అక్టోబర్ 14న రద్దు చేసింది. అయినా అప్పటి నుంచి ప్రొఫెసర్ సాయిబాబా నాగపూర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే బాంబే హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. మరోసారి విచారణ జరపాలని హైకోర్టుకు సూచించింది. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు డివిజన్ బెంజ్ విచారణ చేపట్టింది. మొత్తంగా జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకి ఎస్ ఏ మేనేజెస్ ల ధర్మాసనం ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.
ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి.. తీర్పు వెలువరించిన బాంబే హైకోర్టు..
- Advertisment -