Tuesday, July 1, 2025

12th Fail Movie తెలుగులో ‘12th ఫెయిల్’.. ఎక్కడ చూడాలో తెలుసా?

12th Fail Movie:  12th ఫెయిల్  సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఐపీఎస్ మనోజ్ కుమార్  రియల్ స్టోరీని సినిమాగా  అద్భుతంగా తెరకెక్కించారు. విధు వినోద్ చోప్రా విక్రాంత మస్సే- మేధా శంకర్ ప్రధాన పాత్రలు నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓటీడీలో దుమ్ము రేపుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సినిమాకు అత్యంత ప్రేక్షక ఆదరణ వచ్చింది. అయితే ఈ సినిమా ఇప్పటివరకు కేవలం హిందీలోనే అందుబాటులో ఉండేది. కానీ తాజాగా సౌత్ ఇండియన్ ఆడియన్స్ కు గుడ్ న్యూస్ ఇచ్చింది హాట్ స్టార్.  డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ చిత్రాన్ని డిసెంబర్ 29 నుంచి హిందీలో మాత్రమే ఉంచింది. అయితే ఇప్పటి నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ స్టోరీని చూడొచ్చు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను తమ మాతృభాషలో చూసేందుకు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు వారి కోరిక తీరునట్లుంది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page