Jobs: నిరుద్యోగులకు ఓ ప్రైవేట్ కంపెనీ శుభవార్త తెలిపింది. ప్రముఖ కంపెనీ గూగుల్ కు అనుబంధంగా ఉన్న google play లో ఉద్యోగాలు ఉన్నట్లు వరంగల్ జిల్లా ఉఫాధి కల్పన కార్యాలయం తెలిపింది. వరంగల్, హన్మకొండ, కాజిపేట నగరాల్లో పనిచేయుటకు ఉత్సాహవంతులైన ఉద్యోగుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. జిల్లా కేంద్రంలోని ఉపాధి కల్పనా కార్యాయంలో మార్చి 6న జాబ్ మేళాను నిర్వహించన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇందులో పాల్గొనేవారు బైక్, ఆండ్రాయిడ్ ఫోన్ తప్పకుండా ఉండాలన్నారు. ఉద్యోగానికి ఎంపికైతే రూ.15,000 జీతంతో పాటు ఇన్సెంటివ్ ఉంటుందని తెలిపారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు. మార్చి 6న ఉదయం 11 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. రూ.15000 జీతంతో జాబ్స్.. ఎక్కడో తెలుసా?
- Advertisment -