Narendra Modi In Telangana :ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. మొత్తం రూ. 15,718 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లుగాను ఇప్పటికే 9 మంది అభ్యర్థులను బిజెపి నాయకత్వం ఖరారు చేసింది. అటు ప్రధాని సభలు పార్టీ యంత్రానికి మరింత ఊపు తెస్తాయని బిజెపి శ్రేణులు అంటున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం మహారాష్ట్రలోని నాగ్ పూర్ నుంచి హెలీక్యాప్టర్లో బయలుదేరి ఉదయం 10. 20 గంటలకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్, సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధానికి స్వాగతం పలకనున్నారు. కాగా మోడీ రోడ్డు మార్గంలో స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ రెండు వేదికలు ఏర్పాటు చేయగా అందులో మొదటిది వేదిక నుంచి పలు అభివృద్ధి పనులకు వర్చువల్ ద్వారా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్, సీఎం, కేంద్ర మంత్రి పాల్గొంటారు.
అనంతరం రెండో వేదిక పైకి వెళ్లి బహిరంగ సభలో ప్రసంగిస్తారు ఇందులో కిషన్ రెడ్డితో పాటు ఒకరిద్దరు కేంద్రాన్ని పంతులు పార్టీ నేతలు బండి సంజయ్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తదితరులు ఉంటారు. ఆదిలాబాద్ లో మోడీ సుమారు రెండు గంటల పాటు ఉండనున్నారు. ఇక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి నాందేడ్ కు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి వెళ్తారు. సాయంత్రానికి హైదరాబాద్ కు చేరుకొని రాత్రికి రాజభవన్ లో బస చేయనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ను జాతికి అంకితం ఇస్తారు. అనంతరం సంగారెడ్డి పర్యటనలో పాల్గొంటారు. అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని పర్యటన పురస్కరించని ఉంచుకొని మొత్తం 2000 మంది పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు.