Road Accident:వనపర్తి, జనతా న్యూస్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి హైద్రాబాద్ కు వస్తున్న కారు వనపర్తి జిల్లాలోని కొత్తకోట వద్ద సోమవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలు కావడంతో సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘట సమాచారం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
Road Accident: వనపర్తి: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
- Advertisment -