Narendra modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రంలో మార్చి 4 నుంచి పర్యటించనున్నారు. ఈ మేరకు రూ.15,718 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. 4న ఆదిలాబాద్ లోరూ6,697 కోట్లతో కొన్ని పనులు ప్రారంభించి అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే రెండోరోజు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రమంలో రూ.400 కోట్లతో ఏర్పాటు చేసిన పౌర విమానయాన పరిశోధన సంస్థ ను ప్రారంభిస్తారు. రూ.3,339 కోట్లతో హైదరాబాద్, సికింద్రాబాద్ లో 103 కిలోమీటర్ల మేర చేపట్టిన ఎంఎంటీఎస్ ఫేజ్ 2ను, ఘట్ కేసర్ , లింగంపల్లి మధ్య కొత్త ఎంఎంటీఎస్ రైలును ప్రారంభిస్తారు. ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది.
Narendra modi: 4 నుంచి ప్రధాని పర్యటన
- Advertisment -