హనుమకొండ, జనతాన్యూస్:హనుమకొండ లోని చారిత్రాత్మకమైన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 100 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రిన్సిపాల్ గా రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ సుంకరి జ్యోతి శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జ్యోతి మాట్లాడుతూ కళాశాల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తానని, బోధన, పరిశోధన మౌలిక వసతులు కల్పనకు తగు చర్యలు చేపడతానని, కాకతీయ విశ్వవిద్యాలయానికి మినీ క్యాంపస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అని ఆమె పేర్కొన్నారు.
ప్రొఫెసర్ జ్యోతి ఆర్ట్స్ కళాశాల లో 1992 95 వరకు బీఎస్సీ అభ్యసించారు, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1995 నుండి 97 వరకు ఎంఎస్సీ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లో పట్టా పొందారు.2006లో కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎమ్మెస్సీ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ చేసినారు. ప్రొఫెసర్ జ్యోతి పర్యవేక్షణలో నాలుగు పీహెచ్డీ డిగ్రీల అవార్డు అయినాయి. తన పర్యవేక్షణలో ఏడుగురు పిహెచ్డి పరిశోధకులు ఉన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గా పరీక్షల నియంత్రణ అధికారిగా, డిప్యూటీ డైరెక్టర్ సైన్స్ కోర్సెస్ దూరవిద్య కేంద్రం, ప్రోగ్రాం కోఆర్డినేటర్ నేషనల్ సర్వీస్ స్కీం, యోగ సెంటర్ డైరెక్టర్ గా పని చేశారు, 27 జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నారు. 2002లో జాతీయ ఎన్ఎస్ఎస్ అవార్డు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకున్నారు. పదవి బాధ్యతలు చేపట్టిన ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జ్యోతిని కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్, అసిస్టెంట్ రిజిస్టర్ సరళ, మాధవి అధ్యాపకులు, ప్రొఫెసర్ హనుమంతు, డాక్టర్ ఉష, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ శ్రీలత. డాక్టర్ రమేష్, డాక్టర్ మంద శ్రీనివాస్, డాక్టర్ చిర్రా రాజు, డాక్టర్ సరిత, కళాశాల పిఆర్ఓ డాక్టర్ ఆదిరెడ్డి బోధ నేతల సిబ్బంది రాజు, రాజేందర్, రాధాకృష్ణ, సుధాకర్ తదితరులు అభినందనలు తెలియజేశారు.
వైస్ ప్రిన్సిపల్ గా డాక్టర్ రమేష్!
కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ గా సామాజిక శాస్త్ర విభాగం అధ్యాపకుడు డాక్టర్ పుల్లా రమేష్ శుక్రవారం ప్రొఫెసర్ హనుమంతు నుండి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో కళాశాల అభివృద్ధికి పని చేస్తానని ఆయన అన్నారు. డాక్టర్ రమేష్ ను ఈ సందర్భంగా కళాశాల బోధన , బోధ నేతర సిబ్బంది అభినందనలు తెలియజేశారు.
