షాపింగ్ మాల్ లో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా 44 మంది మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. బంగ్లాదేశ్ లోని ఢాకా నగరంలో షాపింగ్ మాల్ లో గురువారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో షాపింగ్ మాల్ లో ఉన్న పలు రెస్టారెంట్లు, దుకాణాల్లో ఉన్న ప్రజలు తమను రక్షించుకునేందుకు కొంతమంది భయంతో బిల్డింగ్ పైనుంచి దూకారు. మరి కొంతమంది అగ్ని ప్రమాదం కారణంగా వచ్చిన పోగతో ఊపిరాడక చనిపోయారు. కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తంగా 44 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం సంఘటన తెలియగానే ఫైర్ సిబ్బంది పోలీసుల సహాయంతో రక్షణ చర్యలు చేపట్టారు. 13 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేశారు. ఈ క్రమంలో 80 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.
షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం.. 44 మంది మృతి
- Advertisment -