Thursday, September 11, 2025

వీడియో వైరల్ అయింది.. మహిళపై కేసు నమోదైంది. .

వరంగల్ జనత న్యూస్:  మేడారం జాతర సందర్భంగా సరదాగా తీసిన వీడియో వైరల్ అయింది.. ఆ తర్వాత ఓ మహిళపై కేసు నమోదు అయింది.. ఇటీవల మేడారం జాతర నాలుగు రోజులపాటు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశం లోని వివిధ ప్రాంతాల నుంచి జాతరకు కోటిన్నర మంది భక్తులు వచ్చినట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. అయితే ఈ జాతరలో గిరిజనులు అత్యధికంగా పాల్గొన్నారు. వీరిలో కొందరు  అమ్మవార్లను దర్శించుకోవడమే కాకుండా  తమకు అడవిలో దొరికే ఉత్పత్తులను విక్రయించారు. ఈ సందర్భంగా వనమూలికలను విక్రయించే చెంచు లక్ష్మి అనే మహిళ పై ఓ యూట్యూబర్  ప్రత్యేక షూట్ చేశాడు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జంతువులకు సంబంధించిన భాగాలు తన దగ్గర ఉన్నాయి అని అని ఈ వీడియోలో తెలిపింది. అయితే ఈ వీడియో వైరల్ కావడంతోపాటు అటవీశాఖ అధికారుల వద్దకు చేరింది. దీంతో ఆమె దగ్గర జంతువుల భాగాలున్నాయన్న ఆరోపణల పై అధికారులు తనిఖీ చేశారు.‌ కొన్ని  లభ్యం కావడంతో ఆమెపై కేసు నమోదు చేశారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page