రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసులు ఆయనకు నోటీసులు పంపించారు. అయితే ఈ నోటీసులపై డైరెక్టర్ స్పురించలేదు. అంతేకాకుండా ఆయన పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో క్రిష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాదులోని రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో ఇప్పటికే బీజేపీ నేత కుమారుడిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కొందరు చెప్పిన వివరాల ప్రకారం ఈ కేసులో డైరెక్టర్ కిష్ కు సంబంధం ఉందని పోలీసులకు సమాచారం తెలియడంతో ఆయనకు crcp160 నోటీసులు జారీ చేశారు. అయితే వీటిపై స్పందించలేదు. ఇదిలా ఉండగా ఈ కేసులో ఏ 11 నిందితుడిగా వివేక్ డ్రైవర్ ప్రవీణ్ ను చేర్చారు.
డైరెక్టర్ క్రిష్ పరారయ్యాడా?
- Advertisment -