Gujarat: అరేబియా సముద్రానికి ఆనుకొని ఉన్న గుజరాత్ తీరంలో భారీగా డ్రగ్స్ ను నౌక ధళం స్వాధీనం చేసుకుంది. నార్కో ట్రిక్స్ కంట్రోల్ బ్యూరోతో జరిపిన సంయుక్త ఆపరేషన్లు 3,300 కిలోల మాదక ద్రవ్యాలను కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. గుజరాత్ లోని పోరుబందర్ తీరంలో ఇవి ఉన్న నౌకను సీజ్ చేశారు. మంగళవారం అనుమానాస్పదంగా సముద్రంలో ప్రవేశించిన నౌకను అధికారులు ముందుగా గుర్తించారు. వెంటనే దానిని వెంబడించిగా అందులో 3089 కేజీల చరాస్, 158 కేజీల మెథామెప్తమైన్, 25 కేజీల మార్పిన్ ను ఉన్నట్లు గుర్తించారు. దీంతో వీటితో ఉన్న ఐదుగురు వ్యక్తులని అరెస్టు చేసి మొత్తం 3,300 కేజీల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ తో ఉన్నవాళ్లంతా పాకిస్తాన్ జాతీయులుగా నౌకాదళం ప్రకటన విడుదల చేసింది. కొద్ది రోజుల కిందట దాదాపు రూ. 2500 కోట్ల విలువైన డ్రక్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇంత స్థాయిలో డ్రగ్స్ పట్టుకోవడం ఇదే మొదటిసారి అని అధికారులు పేర్కొన్నారు.
గుజరాత్ తీరంలో.. 3,300 కిలోల డ్రగ్స్ పట్టివేత
- Advertisment -