Sunday, March 15, 2026

Bandi Sanjay : 200 యూనిట్ల కరెంట్ తో ప్రజలను మభ్యపెడుతున్నారు: బండి సంజయ్

Bandi Sanjay : కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత కరెంట్ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. ప్రజాహిత మలివిడత యాత్ర ప్రారంభం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించడం తప్పేనని కొదంరు అంటున్నారని అన్నారు. కరీంనగర్, వరంగల్ మధ్య రోడ్డు విస్తరణకు నిధులు తెచ్చిందెవరని, శాతావాహన వర్సిటీకి 12 బి, ఎస్సారార్ కళాశాలకు అటానమస్ హోదా తెచ్చిందెవరు అని బండి సంజయ్ అన్నారు. పీఎం సడక్ యోజన కింద గుండారెడ్డిపల్లి నుంచి ముత్తన్న పల్లి వరకు రూ.3 కోట్ల 74 లక్షలతో బీటీ రోడ్డు వేశామని అన్నారు. అభివృద్ధి పనులను చేస్తున్నా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు కనిపించడ లేదని అన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page