జనతా న్యూస్ బెజ్జంకి : బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన వెన్నం రాజు కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో విజయం సాధించాలని, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు ఎమ్మెల్యేగా గెలుపొందాలని బేగంపేట ఆంజనేయస్వామికి “నూట ఒక్క” కొబ్బరికాయలతో మోక్కులు చెల్లిస్తానని స్వామి వారిని ముక్కుకున్నట్లు తెలిపారు. కవ్వంపల్లి సత్యనారాయణ బేగంపేట ఎంపీటీసీ పోతిరెడ్డి స్రవంతి మధుసూదన్ రెడ్డిల నూతన గృహప్రవేశనికి బుధవారం విచ్చేసిన సందర్భంగా బేగంపేటలోని పాత హనుమాన్ దేవాలయంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలతో స్వామివారికి తన మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో, బేగంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు గుండ అమరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు బేగంపేట మాజీ ఎంపీటీసీ మామిడాల జయరాం, కాంగ్రెస్ నాయకులు సోమ రామ్ రెడ్డి, శీలం నర్సయ్య, గల్ఫ్ సేవా సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బుర్ర తిరుపతి గౌడ్, పత్తి మహేందర్ రెడ్డి, గ్రామ ప్రజలు నాగమల్ల శ్రీనివాస్, మంచాల రాములు, సీనియర్ సిటిజన్ శీలం లక్ష్మీ రాజ్యం తదితరులు పాల్గొన్నారు.