Saturday, July 5, 2025

Medaram Journalist : మేడారంలో జర్నలిస్టుల బస్సు ఇబ్బందులు

  • మేడారం జాతరకు తీసుకెళ్లిన జర్నలిస్టులపై పౌరసరఫరాల శాఖ నిర్లక్ష్యం
  • తిరుగు ప్రయాణంలో దొరకని బస్సు
  • జర్నలిస్టుల తీవ్ర మనస్తాపం

 -N.S. Rao, జనతా ప్రతినిధి, వరంగల్

Medaram Journalist : మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కవరేజ్ కోసం వరంగల్  హన్మకొండ నుంచి మేడారం  వెళ్లేందుకు  జిల్లా పౌర సంబంధాల శాఖ బస్సు సౌకర్యం కల్పించడంలో పూర్తిగా విఫలమైంది.  హన్మకొండ కలెక్టరేట్ నుంచి ఉదయం 9 గంటలకు ఒకటి, 11 గంటలకు మరొకటి అని చెప్పినప్పటికీ  వారిని పట్టించుకోేలేదు. దీంతో  చాలామంది టికెట్ కొనుక్కొని ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు.  మేడారం వెళ్లిన తరువాత  జర్నలిస్టులకు వసతిని కల్పించడంలోనూ పౌర సంబంధాల శాఖ నిర్లక్ష్య వైఖరి తీవ్రంగా కనిపించింది.

మేడారం వెళ్లిన జర్నలిస్టులు అమ్మవార్ల గద్దె వద్దకు వెళ్లకుండా పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు.  జర్నలిస్టులు ప్రత్యేకంగా  పాసులు కలిగి ఉన్నప్పటికీ పోలీసులు వాటిని పట్టించుకోకుండా అడ్డుకోవడం తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.  మేడారం జాతరలో భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించే పోలీసులు కేవలం అధికారులు వచ్చినప్పుడే హడావుడి చేయడం తప్ప..  మిగతా సమయాల్లో  ఎక్కకడా కనిపించ లేదు.

మరోవైపు  జర్నలిస్టులకు పాసులు ఇవ్వడంలో ఒక పద్ధతి ప్రకారం లేకపోవడం.. పత్రికలలో పనిచేసే జర్నలిస్టులను కనీసం గుర్తించి మాట్లాడడం లేకపోవడం.. తాము పలాన పత్రికలో పనిచేస్తున్నామని చెప్పినప్పటికీ పాసులు ఇవ్వడం లేదని కొందరు జర్నలిస్టులు ఆక్రోశం వెళ్లగక్కారు. ఓవైపు  మేడారం జాతర సక్సెక్ కావడానికి మీడియానే  ప్రధాన కారణమనే విషయాన్ని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. కానీ వారికి సౌకర్యాలు కల్పించడంలో  పౌర సంబంధాల శాఖ పూర్తిగా విస్మరించడం తీవ్ర విమర్శలకు గురవుతోంది.  ఇప్పటికైనా ఇటువంటి సంఘటనలు పునవృత్తం కాకుండా చూసుకోవాలసిన బాధ్యత   పౌర సంబంధాల శాఖ అధికారులపై ఉందని అని జర్నలిస్టులు అంటున్నారు.

ఈ జాతరలో ప్రధానంగా చెప్పుకోవాల్సిందేమింటే జర్నలిస్టులకు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించడం పౌర సంబంధాల శాఖ ప్రధాన కర్తవ్యం అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్య వైఖరి తీవ్రంగా కనిపించింది. చివరికి ఓ బస్సు కేటాయించి.. దీనిని జర్నలిస్టులను మేడారంనకు తీసుకెళ్లి ఆ తరువాత పట్టించుకోలేదు. మేడారం దర్శనం అయిన తరువాత బస్సుకోసం జర్నలిస్టులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సంబంధిత బస్సు డ్రైవర్ కు ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ రావడం ఆందోళనను కలిగించింది. అంతేకాకుండా బస్సు వేచి ఉండే వరకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికైనా పౌర సంబంధాల శాఖ జర్నలిస్టుల పట్ల గౌరవప్రదమైన విధానాన్ని అనుసరించాలని నాతో పాటు పలువురు జర్నలిస్టులు కోరుతున్నాం..

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page