Crime :ఛత్తీస్ గఢ్ లో దారుణం చోటుచేసుకుంది. ఈ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో ఓ యువకుడు డబ్బుమీద ఆశపడి సొంత అమ్మమ్మనే చంపించాడు. కాంకేర్ జిల్లా బాందే పోలీస్ స్టేషన్ పరిధిలో రానా పఠారియా అనే మహిళ మనువడు ఆకాశ్ తన అమ్మమ్మ పేరిట కోటి రూపాయల బీమా పాలసీని చేయించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ బీమా సొమ్మును కాజేయాలనుకున్నాడు. ఈ తరుణంలో ఓ వ్యక్తికి రూ. 30,000 సుపారీ ఇచ్చి ఆయన అమ్మమ్మకు పాముకాటు వేయించాడు. దీంతో ఆమె చనిపోయింది. అయితే పాముకాటు కారణంగా మరణం సంభవించిందని నిందితుడు అందరిని నమ్మించాడు. ఈనేపథ్యంలో కోటి రూపాయల బీమా సొమ్ము అందుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆకాశ ప్రవర్తన పై అనుమానం వచ్చి విచారించారు. తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. దీంతో ఆకాశం అరెస్టు చేసి అతని దగ్గర నుంచి రూ. 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
Crime : బీమా సొమ్ము కోసం పాము కాటు వేయించాడు..
- Advertisment -