వరంగల్, జనత న్యూస్:మేడారం జాతర నిర్వహణకు కాంగ్రెస్ అధిక నిధులు ఇచ్చిందని మంత్రి సీతక్క అన్నారు. ఈసారి మేడారం జాతర విజయవంతం అయిందని, ఇందుకు సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు ఆమె కృతజక్ఝతలు తెలిపారు. శనివారం మేడారంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జాతరపై సమీక్ష నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈసారి జాతర మొత్తంలో 1.35 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారన్నారు. మేడారంలో వసతుల కోసం రూ.100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేడారం జాతర కోసం అత్యధికంగా నిధులు కేటాయించిందన్నారు. జాతర విజయవంతానికి 20 శాఖ అధికారులు కష్టపడిపనిచేశారన్నారు. జాతర కోసం ఆర్టీసీ దాదాపు 6 వేల బస్సులను కేటాయించిందని, 12 వేల ట్రిప్పులు నడిపిందన్నారు. మహా జాతరకు వచ్చిన వారిలో 5090 మంది తప్పిపోయారని, వారిలో 32 మంది చిన్నారులు అధికారుల వద్ద ఉన్నారన్నారు. వారిని కుటుంబీకులకు అప్పగిస్తామన్నారు.
Medaram Mahajatara : 20 శాఖల అధికారులు కష్టపడ్డారు.. మేడారం జాతరపై మంత్రి సీతక్క రివ్యూ..
- Advertisment -