హైదరాబాద్, జనత న్యూస్:భారతరాష్ట్ర సమితి పార్టీకి భారీ షాక్ తగిలింది. హైదరాబాద్ మహా నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు పంపించారు. కష్టకాలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కారులను ఆదుకోవడం లేదని, పార్టీ కోసం ఎంతో కాలంగా పనిచేసినా గుర్తింపు లేదని ఈ సందర్భంగా లేఖలో ప్రస్తావించారు. అయితే ఇదివరకే శ్రీలత శోభన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. వీరు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ను ఆశిస్తున్నారు. ప్రస్తుతం అధికారికంగా పార్టీకి రాజీనామా చేశారు.
బీఆర్ఎస్ కు రాజీనామా
- Advertisment -
