Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ లోని 16 ఉద్యోగ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సిఎస్ జవహర్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. పీఆర్సి బకాయిల పెండింగ్, డీఏలపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. తమ డిమాండ్ల పరిష్కారానికి ఏపీ ఎన్ జీవో, ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 27న ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై వారిని చర్చలకు పిలిచింది. గురువారం ఉదయం 10.30 గంటలకు సచివాలయంలోని బ్లాక్ 2 వద్ద మంత్రులు చర్చలు జరిపారు. ఉద్యోగులు మాత్రం పెండింగ్ డీఏలతో పాటు బకాయి పడిన సరెండర్ లీవులు, పెన్షన్ బకాయిలు, సీపీఎస్ ఉద్యోగులకు చెందిన కాంట్రిబ్యూషన్ అన్నీకలిసి 20 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలని అంటున్నారు. కాగా ఉద్యోగులకు మధ్యంతర భృతి చెల్లించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం అనిపిస్తోంది. మరోవైపు చలో విజయవాడకు అనుమతి లేదని పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు.
Andhrapradesh: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు
- Advertisment -