Onion Export: 2023 అక్టోబర్ లో ఉల్లి రేటు బాగా పెరిగింది. రూ. 40 ఉన్న ఉల్లి రేటు ఆ సమయంలో వారం రోజుల వ్యవధి లోనే రెట్టింపు అయింది. దీంతో కేంద్రం 2024 మార్చి 31 వరకు ఇతర దేశాలకు ఉల్లి ఎగుమతులను నిలిపివేయాలని 8 డిసెంబర్ 2023న ప్రకటించింది. అప్పటినుంచి భారతదేశంలోని ఉల్లి పంటలు ఇతర దేశాలకు ఎగుమతి చేయడం లేదు. అయితే తాజాగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ విదేశాంగ శాఖ ఎగుమతికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. దీంతో మారిషన్, బెహ్రాన్, భూటాన్ దేశాలకు 54,760 టన్నుల ఉల్లిపాయాలను ఎగుమతి చేయాలని నిర్ణయించింది.
Onion Export: ఉల్లి ఎగుమతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
- Advertisment -