హైదరాబాద్, జనతన్యూస్:హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిచెందారు. పటాన్ చెరు ఓఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెతీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె తండ్రి సాయన్న గతేడాది మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన కూతురుకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించడంతో గత ఎన్నికల్లో గెలుపొందారు. ఇప్పుడు లాస్య మరణంతో తీవ్రవిషాదంనెలకొంది.
రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి
- Advertisment -