ప్రముఖ యూట్యూబర్ షణ్ముక్ , అతని అన్నయ్య సంపత్ గంజాయి కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు చేసిన విచారణలో సంచలన విషయాలు బయట పడ్డాయి. షణ్ముక్ అన్నయ్య సంపత్ తనను మోసం చేశాడని మౌనిక అనే అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది తనకు యూట్యూబ్లో అవకాశాలు ఇప్పిస్తానని మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా తనకు ఇదివరకే పెళ్లి అయిన విషయం దాచిపెట్టి తనను ప్రేమిస్తున్నారంటూ చెప్పాడని పేర్కొంది. కాగా సంపత్ ను అరెస్టు చేయడానికి పోలీసులు ఆయన నివాసానికి వెళ్లగా షణ్ముక్ తో కలిసి గంజాయి సేవిస్తున్నట్లు కనిపించినట్లు పోలీసులు తెలిపారు దీంతో వారిపై మరో కేసు నమోదు అయింది. గతంలో షణ్ముక్ హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పోలీసుల వలలో చిక్కుకున్నాడు.
గంజాయి సేవిస్తూ దొరికిన యూట్యూబర్ షణ్ముక్
- Advertisment -