Friday, September 12, 2025

మేడారం ఎఫెక్ట్: సిటీ రోడ్లు ఖాళీ..

హైదరాబాద్ జనతా న్యూస్:    మేడారం మహా జాతర సందర్భంగా నగరాలు, పట్టణాలు ఖాళీ అవుతున్నాయి. అమ్మవార్లను దర్శించుకునేందుకు సిటీ వాసులు ప్రత్యేక వాహనాల్లో తరలి వెళుతున్నారు. ముఖ్యంగా హైదరాబాదులోని సికిందరాబాద్, మౌలాలి, అంబర్ పేట , ఓల్డ్ సిటీ నుంచి ప్రతిసారి లక్షలాదిమంది మేడారంనకు వెళ్తారు. ఈసారి కూడా ప్రత్యేక వాహనాల్లో జాతరకు పయనమయ్యారు. దీంతో సిటీ రోడ్లన్నీ నిర్మానుష్యంగా కన్పిస్తున్నాయి. మూడు రోజులపాటు జాతర ఉండడంతో అక్కడే ఉండి ఆ తరువాత తిరుగు పయనం చేస్తారు. హైదరాబాద్ నుంచి మేడారంనకు భక్తులు వెళ్తారనే నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా 1200 బస్సులు ఏర్పాటు చేసింది. మరో 500 నడిపించేందుకు సిద్ధంగా ఉంచారు. హైదరాబాద్ నుంచి మేడారం 250 కిలోమీటర్లు ఉంటుంది. దీంతో కొందరు ప్రత్యేక వాహనాల్లో పయనమవుతున్నారు. మేడారంతోపాటు వివిధ ప్రదేశాలను చూసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page