Virat Kohli: భారత్ స్టార్ బ్యాటర్ రెండోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య అనుష్క శర్మ ఫిబ్రవరి 15న మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. మంగళవారం ఇంస్టాగ్రామ్ లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. తమ చిన్నారికి అకాయి అని పేరు కూడా పెట్టినట్లు చెప్పారు. ‘అకాయ్’ అంటే ప్రకాశించే చంద్రుడు అని అర్థం అని చెప్పారు. 2017 లో వివాహం చేసుకున్న కోహ్లీ అనుష్కకు 2021 లో కూతురు వామికా జన్మించింది. ఇప్పుడు కుమారుడు జన్మించాడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వామికాకు సోదరుడు పుట్టాడని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం.. అని అన్నారు ప్రస్తుతం కోహ్లీ దంపతులు లండన్ లో ఉన్నట్లు. అయితే ఇంగ్లండ్ టెస్ట్ కు కోహ్లీ దూరం ఉన్నది అందుకేనని క్రీడాలోకం చర్చించుకుంటోంది.
Virat Kohli: ఇంగ్లండ్ టెస్ట్ కు విరాట్ కోహ్లీ అందుకే దూరమయ్యాడా?
- Advertisment -