బెజ్జంకి టౌన్, జనతా న్యూస్ :సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పాపయ్య గ్రామం పల్లి గ్రామంలో మంగళవారం రోజు ప్రతిష్ట విగ్రహాలను నీటిలో నుండి తీసి, నవధాన్యాలలో ఉంచి పూలు, పండ్లు వేసి శయనింపజేశారు. శివ పంచాయత, ధ్వజస్తంభ, నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా రెండవ రోజు అయిన మంగళవారం రోజు ఉదయం స్థాపన దేవతా పూజలు, అభిషేకాలు, హోమాలు, దాన్యాధివాసం, ఫల పుష్ప, శయనాదివాసం కార్యక్రమాలు ఘనంగా ముగిసినవి. ఈ సందర్భంగా పలువురు దంపతులు హోమగుండాలలో పాల్గొని యజ్ఞ పూజలను చేసినారు. అనంతరం మహిళలు కుంకుమార్చనతో దేవతల అనుగ్రహం పొందినారు. అన్నదాన కార్యక్రమాన్ని దొనే ప్రభాకర్ వితరణ చేయడం జరిగింది. ఈ ఉత్సవాలలో పలువురు యువకులు, చిన్నారులు వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు
ఘనంగా కుంకుమార్చన
- Advertisment -