- ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి ఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించిన మేయర్ యాదగిరి సునీల్ రావు
కరీంనగర్, జనతా న్యూస్: కరీంనగర్ లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరగడం చాలా బాదకరమని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. గుడిసెలు దగ్దమైన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కరీంనగర్ లో మంగళవారం రోజు ఇందిరానగర్ ఓ ప్రైవేటు హాస్పిటల్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో కొన్ని పూరి గుడిసెలు దగ్దం కాగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మంగళవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాద ఘటన స్థానిక కార్పోరేటర్ ద్వారా విషయం తెలియడంతో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు వెంటనే స్పందించారు. తన పోన్ కాల్ ద్వారా అగ్ని మాపక సిబ్బంది తో పాటు నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది కి సమాచారం అందించి సహయక చర్యలకు ఆదేశించారు. నగరపాలక సంస్థ కు చెందిన వాటర్ ట్యాంకర్లను ఘటన స్థలానికి పంపించి ఎగిసి పడుతున్న మంటలను అర్పించారు. ఒక వైపు అగ్నిమాపక సిబ్బంది, మరో వైపు నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది సహయక చర్యలు చేపట్టడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. అనంతరం విషయం తెలుసుకున్న మేయర్ యాదగిరి సునీల్ రావు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు సమాచారం అందించి ఆయనతో కలిసి ఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. గుడిసెలు దగ్ధం అయిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి… ప్రమాద ఘటనకు గల కారణాలను తెలుసుకున్నారు. అంతే కాకుండా అగ్ని ప్రమాదం లో ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో బాధిత కుంటుంబాలను అడిగి తెలుసుకున్నారు. జరిగిన ఘటన పట్ల విచారణ వ్యక్తం చేస్తూ… ప్రభుత్వం ద్వారా బాధిత కుంటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీస్కుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ… కరీంనగర్ ఇందిరా నగర్ లో అగ్న ప్రమాదం చోటు చేస్కోవడం చాలా బాధాకరమన్నారు. కూలీ చేస్కుంటు జీవనం సాగించే పేద ప్రజలకు ప్రభుత్వం ద్వారా న్యాయం జరిగేలా చూస్తామని… ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా యంత్రాంగం జరిగిన ప్రమాద ఘటనను ప్రభుత్వానికి తెలిపి వారిగి తగిన ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో అదృష్ఠావశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ఈ ప్రమాద ఘటన సహాయక చర్యల్లో నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.