Saturday, March 14, 2026

ఎంపీ బండి సంజయ్ దాతృత్వం

  • ఆదర్శనగర్ పూరిగుడిసె బాధితులకు నిత్యవసర వస్తువులు, వంట పాత్రలు అందజేత

కరీంనగర్, జనతా న్యూస్:  పట్టణంలోని ఆదర్శ నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదానికి గురైన దాదాపు 30పూరి గుడిసెల బాధిత కుటుంబాల పట్ల ఎంపీ బండి సంజయ్ కుమార్ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఘటనపై ఎంపీ బండి సంజయ్ కుమార్ చలించి పోయారు. అక్కడి నిరుపేద కుటుంబాల కోసం కరీంనగర్ బిజెపి శ్రేణుల ద్వారా అవసరమైన నిత్యావసర వస్తువులు, వంట పాత్రలను ఇతర సామాగ్రిని మంగళవారం రాత్రి అందించారు. గుడిసెలు దగ్ధమై నిలువ నీడ లేక ఉన్న కుటుంబాల కోసం అండగా నిలవాలని , ఆయా కుటుంబాలకు ఇంటి సదుపాయం కలిగే వరకు వారికి ఉదయం మధ్యాహ్నం రాత్రి వేళల్లో భోజన సదుపాయం అందించాలని బీజేపీ శ్రేణులకు ఆయన సూచించారు . కార్యక్రమంలో
బాస సత్యనారాయణ, దుబ్బల శ్రీనివాస్, గుగ్గిల రమేష్, రాపర్తి ప్రసాద్, కటకం లోకేష్ , దురుశెట్టి సంపత్ , ఎండీ ముజిప్, ఉప్పరపల్లి శ్రీనివాస్, అనిల్, ప్రసన్న, అవుదుర్తి శ్రీనివాస్, శివరాజ్ , బషీర్.
కార్పొరేటర్ కోలగని శ్రీనివాస్, బండ రమణారెడ్డి, రాపర్తి విజయ, పెద్దపెల్లి జితేందర్ , నాగ సముద్రాల ప్రవీణ్.మునిగంటి కుమార్, బండారు గాయత్రి , బల్వీర్ దళితులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page