హైదరాబాద్, జనతన్యూస్: తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఈమేరకు రిటర్నింగ్ అధికారులు మంగళవారం ప్రకటించారు. తెలంగాణలోని మూడు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి వద్దిరాజు రవిచంద్రన్ నామినేషన్ వేయగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి తెలిపారు. కాగా రాజ్యసభ ఎన్నికలకు ఇటీవల షెడ్యూల్ విడుదల అయింది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. రాజ్యసభకు వీరితో పాటు ఇండిపెండెంట్ గా భాస్కర్, భోజరాజు కోయాల్కర్, కిరణ్ రాథోడ్ లో నామినేషన్లు దాఖలు చేశారు. అయితే వీరి నామినేషన్లు తిరస్కరించడంతో పై ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తెలంగాణ: మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం
- Advertisment -