Bollywood : బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు రితూ రాజ్ సింగ్ గుండెపోటుతో మరణించారు. కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. సోమవారం అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో అస్వస్థతతో తుదిశ్వాస విడిచారు. రితూ సింగ్ ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించారు. ఆలియా భట్ , వరున్ ధావన్ జంటగా వచ్చిన ‘హంప్టీ శర్మ కీ దుల్హానియా’ లో ఆయన ప్రత్యేకంగా నిలుసస్తారు. రితూసింగ్ మరణంతో పలువురు ఆయనకు సంతాపం ప్రకటించారు.