రంగారెడ్డి, జనత న్యూస్: బీజేపీతో పొత్తు ఎప్పటికైనా ఉండదని కరీంనగర్ ఎంపీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా బండి సంజయ్ మెదక్ జిల్లా తాండూర్ లో మాట్లాడారు. ఇటీవల బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు ఉంటుంటుని వస్తున్న కథనాలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ లో రాముడు లాంటి ప్రధాని మోదీ ఉన్నారని అన్నారు. బీజేపీతో పొత్తు ఉంటుందని కాంగ్రెస్ అసత్యపు ప్రచారం చేస్తోందన్నారు. జమ్మూ కశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసినందుకు బీజేపీకి 370 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో బీజేపీ నేతలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Bandi Sanjay : బీఆర్ఎస్ తో పొత్తు అంటూ కాంగ్రెస్ అసత్యపు ప్రచారం:
- Advertisment -