జగిత్యాల, జనత న్యూస్: తెలంగాణ ప్రభుత్వ విప్, జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి సొంత నియోజకవర్గానికి వెళ్తుండగా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా బోల్తా పడింది.ఈ ప్రమాదంలో మరికొంత మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని కరీంనగర్ కు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం యశోధ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా ఎమ్మెల్యే కారు బోల్తా
- Advertisment -