Credit Card : క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్జల్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో కీసర గ్రామానికి చెందిన సురేష్ కుమార్ కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల అప్పుల భారం కావడంతో దంపతులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం పిల్లలను బంధువుల ఇంటికి పంపించి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు.
Credit Card : క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేక దంపతులు ఆత్మహత్య
- Advertisment -