- నాయిని విశాల్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ నాయిని శ్రీగోధ
- వరంగల్ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాసం పై అవగాహన సదస్సు
- విద్యార్థినీలకు హైజీన్ కిట్ల పంపిణీ
- పీజీ పూర్తికాగానే పింగళి కళాశాల విద్యార్థినీలకు ప్రతినెలా ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటుకు హామీ
- సర్వైకల్ బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన
వరంగల్, జనత న్యూస్:విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత స్థానంలో నిలవాలంటే ఆర్తి, స్ఫూర్తి, కీర్తి అనే మూడు సూత్రాలే ప్రామాణికమని నాయిని విశాల్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ నాయిని శ్రీగోధ అన్నారు. శనివారం రోజున వడ్డేపల్లి ప్రభుత్వ పింగళి మహిళా కళాశాల (స్వయంప్రతిపత్తి) లో మహిళాశిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం, నాయిని విశాల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాసం రాబోయే పరీక్షలు సన్నద్ధత అంశంపై అవగాహన సదస్సు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్రమౌళి అధ్యక్షతన జరిగింది, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శ్రీగోధ మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాలను సాధించడానికి విద్యార్థిని విద్యార్థులకు ఎన్నో అవరోధాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అయితే ఆర్తి చెంది మహనీయుల స్ఫూర్తితో చదివితే కీర్తి పతాకం ఎగురవేస్తారని అన్నారు.
శ్రద్ధా, ఆసక్తితో చదివితే వంద శాతం ఫలితాలు తథ్యమని, ఉన్నతమైన ఆశయాలతో చదివి ఉన్నత స్థాయిలో ఎదగాలని, సంకల్పం ఉన్న వ్యక్తికి పేదరికం అడ్డుకాదని, ప్రతి ఒక్కరూ గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్, స్వామి వివేకానంద లాంటి మహనీయుల బాటలో నడిచి భవిష్యత్ దిశా నిర్దేశం చేసుకొని సమాజానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు, ఎంత ఎత్తుకు ఎదిగామన్నది మ్ముఖ్యం కాదని, విద్యా వైద్య ఆర్థిక, సామాజిక రంగాలలో అభివృద్ధికి దూరంగా ఉన్న ఎంతమందికి చేయూతనివ్వాలో తెలుసుకోవాలని, ముఖ్యంగా గ్రామీణ మారు మూల ప్రాంత ప్రజలకు సేవలందించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చే విద్యార్థినీలు లక్ష్యసాధన కోసం కళాశాలకు వస్తారని అయితే చాలా మంది రక్త హీనతతో బాధ పడుతున్నారని. ఆరోగ్యంగా ఉంటేనే చదవడానికి ఆసక్తి కలుగుతుందని, ప్రతి ఒక్కరూ పౌష్టిక ఆహారం తీసుకోవాలని, సర్వైకల్ బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించి ఎవరైనా సమస్యలు ఉంటే సంబంధిత వైద్యులకు చూపించుకోవాలని అన్నారు.

వైద్య విద్యలో పీజీ పూర్తికాగానే తమ ట్రస్ట్ ద్వారా ప్రతి నెలా పింగళి కళాశాల విద్యార్థినీలకు ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినారు.కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్రమౌళి మాట్లాడుతూ ఈ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు చాలా మంది ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని. ప్రస్తుత విద్యార్థినిలు కూడా ఉన్నత రంగాల్లో రాణించాలని ఆశాభావం వ్యక్తంచేశారు.కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కే సుజాత మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల వివరించారు. సైబర్ క్రైమ్, ర్యాగింగ్ మరియు అపరిచిత వ్యక్తులతో జాగ్రత్త వహించాలని అన్నారు.
చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మొదటి గురువులు తల్లితండ్రులని తరువాత అధ్యాపకులేనని వారిచ్చే ప్రతి సూచన సలహా మేరకు నడుచుకోవాలని ఆన్నారు.
అనంతరం నాయిని విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థినిలకు హైజీన్ కిట్ల పంపిణీ కార్యక్రమం డాక్టర్ శ్రీగోధ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. అనంతరం డాక్టర్ శ్రీగోధ, డి విష్ణు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కే సుజాత, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్ లను ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం ఘనంగా సన్మానించడం జరిగింది.కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుహాసిని సమన్వయకర్తగా వ్యవహరించగా, డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ డి జే చారి, డాక్టర్ పార్వతి, డాక్టర్ రేణుక, డాక్టర్ స్నేహాలత రెడ్డి, ఈవి సాత్వీక, దీక్షితారెడ్డి, రాధిక, శిరీష తదితరులు పాల్గొన్నారు.
