కరీంనగర్, జనత న్యూస్: పదవ తరగతి పాఠశాల విద్యార్థుల అల్పహారానికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మరియు జమ్మికుంట ఎస్ఆర్కే డైయిరి 8లక్షల విరాళం అందించినట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.పదవ తరగతి వార్షిక పరీక్షల్లో ఉతీర్ణతను సాధించే దిశగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించడంతో పాటు పాఠశాల అనంతరం అదనపు తరగతులను నిర్వహించడంతో పాటు సాయత్రం పూట అల్పాహారాన్ని అందించడం జరుగుతుంది. ఈ దిశగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మద్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించే దిశగా కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియెషన్ వారు 5 లక్షలు మరియు ఎస్.ఆర్.కే డైయిరీ జమ్మికుంట 3 లక్షల రూపాయల విరాళం చెక్కును శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ లక్ష్మి కిరణ్ , జిల్లా రైస్ మిల్లర్ల అసోసియెషన్ సభ్యులు నర్సింగరావు, ప్రభాకర్ రావు, ఆనంద రెడ్డి, రాజమౌళి, గిరిదర్, కేశవరెడ్డి, ఎస్.ఆర్.కె. డైరీ జమ్మికుంట సభ్యులు పాల్గోన్నారు.
Karimnagar : పదవ తరగతి విద్యార్థుల అల్పహారానికి రూ.8లక్షల విరాళం
- Advertisment -