కోరుట్ల, జనతా న్యూస్: కోరుట్ల పట్టణంలోని మాదాపూర్ కాలనీ లో ముత్యా ల పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా జరిగాయి.కాలనీలోని ముత్యాల పోచమ్మ తల్లి ప్రతిష్టపణలో భాగంగా కాలనీ వాసులు అమ్మవారికి బోనాలు సమర్పించారు భక్తులందరూ భక్తిశ్రద్ధలతో మొక్కులు బోనాలను సమర్పించారు. కులమతా లకు అతీతంగా వాడలో నివసించే ప్రతి ఒక్కరూ అమ్మ వారికి బోనాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించారు. ముత్యాల పోచమ్మ నుంచి బయలుదేరి పోచమ్మవాడ నుంచి మెయిన్‌రోడ్ జండాచౌరప్తా మీదుగా బాణ సంచాలు కాల్చుకుంటూ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరి ఆరోగ్యం చల్లగా కాపాడాలని రైతులకు మంచి పనులు ఉండాలని కాలనీ వాసుల వాణిజ్య, వ్యాపార సంస్థలు బాగుండాలని ముత్యా ల పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమం ముత్యాల పోచమ్మవాడ దేవస్థానం కమిటీ స్థానిక వార్డ్ కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీ నారాయణ, తోట దుర్గాప్రసాద్, ఎన్నం ఎర్రయ్య, మరియు కాలనీ వాసులు భక్తుల సమక్షంలో అంగ రంగా వైభవంగా ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక వార్డ్ కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీ నారాయణ బోనం ఎత్తుకుంటూ డప్పులు కొడుతూ భక్తులను అలరించారు కాలనీ వాసులు అందరూ ఆనందయోత్సహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు.
Korutla : ఘనంగా ముత్యాల పోచమ్మ బోనాలు
- Advertisment -