కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, జనత న్యూస్: హరితహారం లో భాగంగా జిల్లాలోని మున్సిపాలిటీలలో నాటిన ప్రతి మొక్క సంరక్షింపబడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హరితహారం కార్యక్రమంపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో హరితహారం కార్యక్రమం ద్వారా నాటిన ప్రతి మొక్క సంరక్షింపబడాలని, మొక్కలకు జియోట్యాగింగ్ జరపడంతో పాటు వాటికి రీకన్షలేషన్ చేపట్టాలని పేర్కోన్నారు. మొక్కలను అటవీ శాఖ సూచనల మేరకు నాటాలని సూచించారు. జిల్లాలో పెరిగిన మొక్కలను తొలగించాల్సి వచ్చినట్లయితే సంబంధిత పంచాయితీ సెక్రటరి, పిఆర్, లోకల్ బాడిస్ అధికారుల అనుమతులను ఆయా ఏజేన్సిలు కచ్చితంగా పొందాలని ఆదేశించారు. ఇంటింటికి ఇచ్చే మొక్కలలొ పూలు, పండ్లు మరియు కూరగాయల మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి ఇంటికి అవసరం మెరకే మొక్కలను ఇవ్వడంతో పాటు, ఇచ్చిన మొక్కల సంరక్షణను వారంరోజులకోసారి పర్యవేక్షించాలని తెలిపారు. మల్టిలేయర్, ఇతర మొక్కలకు వాటరింగ్ సక్రమంగా జరగాలని అన్నారు. హోంస్ట్రీట్ ప్లాoటేషన్ కొరకు ప్రైమరి బెడ్ లలో మొక్కలను పెంచి జూట్ బ్యాగుల ద్వారా ఇంటింటికి అందించాలన్నారు. పైలెట్ గా పాలి ఫ్రీ నర్సరీలను తయారు చేయడానికి ప్రణాళికను రూపొందించి ఇంటింటి మొక్కలను ప్లాస్టిక్ రహిత బ్యాగులు, బ్యానర్లు లేకుండా అందించేలా ప్రణాళికను రూపొందించాలని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, అటవిశాఖ అధికారి బాలామణి, డి ఆర్ డి ఓ శ్రీధర్, డిఎఓ ప్రియదర్శిని, పిడి రవీందర్, మున్సిపల్ కమీషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు.