Pady KoushikReddy: కరీంనగర్, జనత న్యూస్: సీఎం రేవంత్ రెడ్డిపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. రేవంత్ రెడ్డి అబద్దాలు ఆడడం ఎక్కువైందని అన్నారు. ఇలాంటి వారిని పాతాలాజికల్ లయర్ అని అంటారన్నారు. హరీష్ రావుపై సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఆ విషయం రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని అన్నారు. కాంగ్రెస్ లో ఏక్ నాథ్ షిండే అయ్యేదే రేవంత్ రెడ్డి అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు అయిన తరువాత ఆరు నెలల్లో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలను జారీ చేస్తోందని విమర్శించారు. ఆరు గ్యారెంటీలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు.
Pady KoushikReddy: రేవంత్ రెడ్డిపై పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- Advertisment -