- కరీంనగర్ జిజిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, జనత న్యూస్: రానున్న కరీంనగర్ లోకసభ ఎన్నికల కౌంటింగ్ కొరకు పకడ్బందీ ఏర్పాట్లు జరగాలని జిల్లా కలెక్టర్ పమెలా సత్పతి పేర్కోన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో లోకసభ ఎన్నికల కౌంటింగ్ కొరకు ఏర్పాట్లను కమీషనర్ ఆఫ్ పోలీస్, అదనపు కలెక్టర్ మరియు కరీంనగర్ పార్లమెంట్ నియోజవర్గం పరిధిలోని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గ పరిధి లోని కరీంనగర్, మానకొండూర్, హుజురాబాద్, వేములవాడ, రాజన్న సిరిసిల్లా, చోప్పదండి మరియు హుస్నాబాద్ నియోజక వర్గాలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ ను జిల్లా కేంద్రంలోని ఎస్. ఆర్. ఆర్. కళాశాలలో నిర్వహించడం జరుగుతుందని, వాటి కొరకు ముందుగానే పకడ్బందీ ఏర్పాట్లు జరగాలని సూచించారు. అసెంబ్లి ఎన్నికల కౌంటింగ్ జరిగినట్లుగానే ఎంట్రి, ఎగ్జిట్ లు ఉండాలని పార్టీ ప్రతినిధులకు సిబ్బందికి వేరువేరుగా కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించేలా ఏర్పాట్లు జరగాలని తెలిపారు. అనంతరం కళాశాలలో కౌంటింగ్ కొరకు పలు గదులను పరిశీలించి పలు సూచనలను అధికారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో సిపి అభిషేక్ మహంతి, ఆదరపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, టౌన్ ఎసిపి నరేందర్ 7 నియోజక వర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు మహేశ్వర్, రాజు, మధుసూదన్ రావు, ఆనంద్ కుమార్, ఇతర అధికారులు సిబ్బంది పా ల్గొన్నారు.
